దేశంలో భారీగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు
- నిన్న దేశంలో 67,597 కరోనా కేసులు
- 1,188 మంది మృతి
- మరణాల సంఖ్య మొత్తం 5,02,874
- రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతం
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 9,94,891 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 5,02,874కు పెరిగింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 170,21,72,615 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.