ఎన్నిసార్లు ఓడించినా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంతే!: లోక్ సభలో ప్రధాని మోదీ
- రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం
- చర్చ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని
- అనేక రాష్ట్రాలు కాంగ్రెస్ ను తిప్పికొట్టాయన్న మోదీ
- ఇంకా అహంకారం తగ్గలేదని వ్యాఖ్యలు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ ఈమేరకు విరుచుకుపడ్డారు. అనేక సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్, త్రిపుర, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో లేదని, ఆ పార్టీని ఆయా రాష్ట్రాల వారు ఇప్పటికీ ఆమోదించే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గనుక అధికారంలో ఉండుంటే అంతా కొవిడ్ పై నెట్టేసి తాను తప్పించుకునేదని ఆరోపించారు.