తెలంగాణలో కొత్తగా 2,387 మందికి కరోనా

Telangana corona daily update
  • గత 24 గంటల్లో 79,561 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 688 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 30,931 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 79,561 శాంపిల్స్ పరీక్షించగా... 2,387 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 688 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలలో 131 కేసుల చొప్పున గుర్తించారు.

అదే సమయంలో 4,559 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,74,215 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,39,187 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 30,931 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,097కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Update
Today Cases

More Telugu News