ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా రోజువారీ కేసులు... తాజా వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 30,886 కరోనా టెస్టులు
- 4,198 మందికి పాజిటివ్
- తూర్పు గోదావరి జిల్లాలో 555 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఐదుగురి మృతి
- ఇంకా 88,364 మందికి చికిత్స
అదే సమయంలో 9,317 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,97,369 మంది కరోనా బారినపడగా, వారిలో 21,94,359 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 88,364 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,646కి పెరిగింది.