తెలంగాణలో మరో 2,484 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 65,263 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,045 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 38,723 మందికి చికిత్స
అదే సమయంలో 4,207 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,61,050 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,18,241 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 38,723 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,086కి పెరిగింది.
