ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక్కడుగు ముందుకు వస్తే మేం నాలుగడుగులు వేస్తాం: బొప్పరాజు
- డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఆందోళనలు
- విజయనగరం కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు
- హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు
- ఉద్యోగులకు మద్దతు
తాము చర్చలకు రావడంలేదని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, 9 మంది ఉద్యోగ సంఘ నేతలు వెళ్లి చర్చల్లో పాల్గొని డిమాండ్లను చెప్పడం నిజం కాదా? అని ప్రశ్నించారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బొప్పరాజు పేర్కొన్నారు.
జీవోల్లో శాస్త్రీయత లేదని మీరే అంటున్నారు... అలాంటప్పుడు వాటిని సరిదిద్దాలని బొప్పరాజు పేర్కొన్నారు. ఫిబ్రవరి 3న తాము చేపట్టే ఛలో విజయవాడ కార్యక్రమం చూశాకయినా ప్రభుత్వ నిర్ణయం మారాలి అని వ్యాఖ్యానించారు.