Nuvvu Siggupadithe: నువ్వు సిగ్గుపడితే... బంగార్రాజు నుంచి చివరి సాంగ్ విడుదల

Final lyrical song from Bangarraju
షార్ట్స్‌లో చూడండి
నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన బంగార్రాజు చిత్రం నుంచి చివరి గీతం కూడా అభిమానుల ముందుకొచ్చింది. 'నువ్వు సిగ్గుపడితే' అనే ఈ పాటను చిత్రబృందం నేడు యూట్యూబ్ లో పంచుకుంది. అనూప్ రూబెన్స్ బాణీలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. చిత్ర, సాయిచరణ్, రమ్య బెహరా ఆలపించారు.

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు చిత్రం ఈ సంక్రాంతి సీజన్ లో రిలీజైన సంగతి తెలిసిందే. నాగ్ సరసన రమ్యకృష్ణ, నాగచైతన్య సరసన కృతిశెట్టి నటించారు. రావు రమేశ్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, ఝాన్సీ, రోహిణి, అనితా చౌదరి ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని జీస్టూడియోస్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించింది.

కాగా, ఈ చిత్రంలోని పాటలను ఇటీవల వరుసగా విడుదల చేస్తున్నారు. ఇవాళ విడుదల చేసింది ఫైనల్ సాంగ్ అని నాగార్జున ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ మేరకు పాట లింకును పంచుకున్నారు.
Go Back to Shorts
Nuvvu Siggupadithe
Song
Bangarraju
Nagarjuna
Tollywood

More Telugu News