క్రికెట్ మైదానంలో 'పుష్ప' మేనియా.. వీడియో ఇదిగో!
- అల్లు అర్జున్ హీరోగా పుష్ప
- క్రీడా రంగంలనూ బన్నీ క్రేజ్
- శ్రీవల్లి పాటకు క్రికెటర్ల స్టెప్పులు
- వీడియోలు వైరల్
తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో పలువురు ఆటగాళ్లు వికెట్ పడినప్పుడు శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ లా కాళ్లు ఈడుస్తూ స్టెప్పులేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు వైరల్ గా మారింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో స్టార్ ఆటగాళ్లు డ్వేన్ బ్రావో తదితరులు పుష్ప డ్యాన్సులతో అలరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను సినీ విశ్లేషకుడు కేఆర్కే పంచుకున్నాడు.