తెలంగాణలో ఒక్కరోజులో 4,559 కరోనా పాజిటివ్ కేసులు

Telangana daily corona cases bulletin
  • గత 24 గంటల్లో 1,13,670 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,450 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 36,269 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,13,670 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,559 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,450 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 432, రంగారెడ్డి జిల్లాలో 322, హనుమకొండ జిల్లాలో 201, ఖమ్మం జిల్లాలో 145, నల్గొండ జిల్లాలో 138, కరీంనగర్ జిల్లాలో 112 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 1,961 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,43,354 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,03,008 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 36,269 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 4,077కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Cases
Update

More Telugu News