బుద్ధా వెంకన్న అరెస్ట్ కుట్రపూరితం: చంద్రబాబు
- బుద్ధా వెంకన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
- కేసీనోపై ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ ఆగ్రహం
- పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందని వ్యాఖ్య
గుడివాడలో ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. దాడి చేసినవారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం హేయం అని వ్యాఖ్యానించారు. పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందని, తప్పు చేసిన పోలీసులు విచారణ ఎదుర్కొనక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.