ఏపీలో మరో 14,502 మందికి కరోనా... పూర్తి వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 40,266 కరోనా పరీక్షలు
- విశాఖ జిల్లాలో 1,728 కొత్త కేసులు
- పలు జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు
- రాష్ట్రంలో ఏడుగురి మృతి
- ఇంకా 93,305 మందికి చికిత్స
తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,549కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 21,95,136 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,87,282 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 93,305 మంది చికిత్స పొందుతున్నారు.