ప్రభాస్తో సినిమాపై దర్శకుడు మారుతి స్పందన
- డీవీవీ దానయ్య నిర్మాణంలో ప్రభాస్ సినిమా అంటూ వార్తలు
- దానికి మారుతి దర్శకత్వమని ఊహాగానాలు
- పలు రకాల ప్రచారం జరుగుతోందన్న మారుతి
- సమయమే అన్నింటినీ బయటపెడుతుందని వ్యాఖ్య
- అప్పటి వరకూ వేచి ఉండాలని సూచన
తన భవిష్యత్తు ప్రాజక్టులు, వాటి టైటిల్స్, ఇతర అంశాలపై పలు రకాల ప్రచారం జరుగుతోందని చెప్పారు. అయితే, సమయమే అన్నింటినీ బయటపెడుతుందని, అప్పటి వరకూ వేచి ఉండాలని ఆయన తెలిపారు. తనను దర్శకుడిగా సపోర్ట్ చేస్తోన్న వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.