ఆ అమ్మాయి గురించి మీరు టీజర్లో చూడాలి!
- ఇంద్రగంటితో సుధీర్ బాబు
- ఇద్దరి కాంబోలో మూడో సినిమా
- కంటి డాక్టర్ పాత్రలో కృతి శెట్టి
- త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. సుధీర్ బాబు ఇందులో సినిమా డైరెక్టర్ గా .. కంటి డాక్టర్ గా కృతి శెట్టి కనిపించనున్నారనే విషయం ఈ టీజర్ వలన తెలుస్తోంది. ఆమెను తన సినిమాలో హీరోయిన్ గా ఒప్పించడానికి ఆయన తాపత్రయ పడటం ఈ టీజర్ లో చూపించారు.
ఆయన అదే పనిగా తన చుట్టూ తిరుగుతూ ఉండటంతో, ఆయన సినిమాలో చేయడానికి ఆమె అంగీకరిస్తుంది. అయితే అందుకు ఒక షరతు పెడుతుంది. ఆ షరతు ఏమిటనే సస్పెన్స్ ను రేకెత్తిస్తూ కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ - మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.