సామ్–చై విడాకులపై కథనాలు ఎంతో బాధించాయి: నాగార్జున

నాగచైతన్య–సమంత విడిపోయి మూడు నెలలవుతున్నా వారి చుట్టూ ఇంకా పలు రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన పుకార్లపై ఇటు సమంత, అటు నాగచైతన్య ఇద్దరూ వివరణ ఇచ్చారు. వాటిపై తాజాగా నాగార్జున కూడా స్పందించారు. బంగార్రాజు సక్సెస్ తో జోష్ లో ఉన్న ఆయన.. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్–చైతూ విడాకులపైనా మాట్లాడారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కావాలనే కొందరు ఇలాంటి చెత్త ప్రచారాలు చేస్తున్నారని, ఇద్దరి విడాకులపై లేనిపోనివి పుట్టిస్తున్నారని నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యూట్యూబ్ చానెళ్లలో ఇలాంటి వాటికి కొదవ లేకుండా పోయిందన్నారు. తనపై ఇలాంటి చెత్త ప్రచారాలు చేసినా పట్టించుకోలేదని, పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు అనే సూక్తిని తాను నమ్ముతానని, అందుకే వాటి గురించి పట్టించుకోలేదని తెలిపారు. అయితే, తన కుటుంబం గురించి అలాంటి చెత్త కథనాలు ప్రసారం చేసేసరికి బాధపడ్డానని నాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వాటిని తాను పట్టించుకోనని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.

Tollywood
Nagarjuna
Samantha
Naga Chaitanya
Bangarraju

More Telugu News