ఏపీలో ఇలాంటి ప‌రిస్థితుల్లో జిల్లాకి ఓ ఎయిర్‌పోర్టు చొప్పున క‌డ‌తారా?: అయ్య‌న్న‌పాత్రుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో ఇలాంటి ప‌రిస్థితుల్లో జిల్లాకి ఓ ఎయిర్‌పోర్టు చొప్పున క‌డ‌తారా?: అయ్య‌న్న‌పాత్రుడు

ayyanna slams jagan
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను జ‌గ‌న్ అప్పులపాలు చేశారు
  • గ‌త ఏడాది వైద్య క‌ళాశాల‌ల‌కు శంకుస్థాప‌న‌లు
  • వాటి ప‌నులు ఏమ‌య్యాయి?
  • ఉద్యోగుల‌తో పాటు పింఛ‌నుదారుల‌కూ డ‌బ్బులు ఇవ్వ‌ట్లేదంటూ విమర్శలు 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అప్పులపాలు చేశార‌ని టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు అన్నారు. శంకుస్థాప‌న‌ల‌కే ప్ర‌భుత్వం ప‌రిమిత‌మ‌వుతోంద‌ని, అనంత‌రం ప‌నులు చేప‌ట్ట‌డం లేద‌ని విమ‌ర్శించారు. గ‌త ఏడాది వైద్య క‌ళాశాల‌ల‌కు శంకుస్థాప‌న‌లు చేశార‌ని, వాటి ప‌నులు ఏమ‌య్యాయ‌ని నిల‌దీశారు.

రాష్ట్రంలో ఉద్యోగుల‌తో పాటు పింఛ‌నుదారుల‌కూ డ‌బ్బులు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న చెప్పారు. ప‌రిస్థితులు ఇంత దారుణంగా ఉండ‌గా, మ‌రోవైపు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు ఉండాలని సీఎం జగన్ అంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఏపీలో ఇలాంటి ప‌రిస్థితుల్లో జిల్లాకి ఓ ఎయిర్‌పోర్టు చొప్పున క‌డ‌తారా? అంటూ అయ్య‌న్న‌పాత్రుడు ప్ర‌శ్నించారు.
Ayyanna Patrudu
Telugudesam
Jagan

More Telugu News