కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను ఇక మెడికల్ షాపుల్లో కొనుక్కోవచ్చు!
- వ్యాక్సినేషన్‌లో ఈ రెండు టీకాలే వినియోగం
- బహిరంగ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు అనుమతులకు వినతి
- షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని సీడీఎస్‌సీవో సిఫార్సు
- డీసీజీఐ అనుమతి లభించిన వెంటనే మార్కెట్లోకి
ఇక ఇప్పుడు వీటిని బహిరంగ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు అనుమతివ్వాలంటూ ఈ రెండు సంస్థలు విడివిడిగా భారత ఔషధ నియంత్రణ మండలి డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. వీటి అభ్యర్థనను పరిశీలించేందుకు బుధవారం సమావేశమైన సీడీఎస్‌సీఓ నిపుణుల కమిటీ కొన్ని షరతులతో ఈ రెండు టీకాలను బహిరంగ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. తుది ఆమోదం కోసం ఈ సిఫార్సులను డీసీజీఐకి పంపిస్తారు. అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ రెండు టీకాలు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి.