తొలి వన్డే... ఇండియా ముందు భారీ టార్గెట్ పెట్టిన సౌతాఫ్రికా
- 4 వికెట్లకు 296 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
- సెంచరీలతో కదం తొక్కిన బవుమా, డుస్సేన్
- బుమ్రాకు 2, అశ్విన్ కు ఒక వికెట్
దక్షిణాఫ్రికా ఇతర బ్యాట్స్ మెన్లలో డీకాక్ (27), మలాన్ (6), మార్క్ రామ్ (4), మిల్లర్ (2) పరుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో 18 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా, అశ్విన్ ఒక వికెట్ తీశాడు. మార్క్ రామ్ రనౌట్ అయ్యాడు. డుస్సేన్, మిల్లర్ నాటౌట్ గా నిలిచారు. 297 పరుగుల లక్ష్యంతో టీమిండియా కాసేపట్లో బ్యాటింగ్ కు దిగనుంది.