పేద పిల్లలకు ఆ అవకాశాన్ని ఇవ్వొద్దని ఏడుస్తున్న బాబు గ్యాంగ్ ఎలా స్పందిస్తుందో?: తెలంగాణాలో ఇంగ్లిష్ మీడియంపై విజయసాయిరెడ్డి
- ఏపీలో ఇంగ్లిష్ మీడియంపై ప్రతిపక్షాల విమర్శలు
- తెలంగాణాలో పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం
- తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేద పిల్లలకు వద్దంటున్నారంటూ విమర్శ
ఇంగ్లిష్ మీడియం అమలు విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించిందని, తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేద పిల్లలకు ఆ అవకాశాన్ని ఇవ్వొద్దని ఏడుస్తున్న బాబు గ్యాంగ్ ఎలా స్పందిస్తుందోనంటూ వ్యాఖ్యానించారు. కాగా, గత ఏడాది ఏపీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టే నిర్ణయం తీసుకోగా, టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.