కరోనా ఎఫెక్ట్: స్కూళ్లకు సెలవులు పొడిగింపు
- జనవరి 30దాకా పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు
- వైద్య శాఖ సిఫార్సుకు సీఎస్ ఆమోదం
- ఇవాళ్టితో ముగిసిన సంక్రాంతి సెలవులు
వాస్తవానికి ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని పేర్కొంటూ జనవరి 9న ప్రభుత్వం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, స్కూళ్లకూ సెలవులను అప్పటిదాకా పొడిగిస్తారా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. 20 వరకు పొడిగించాలని భావించారు కూడా. తాజాగా 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.