అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో సభలు, రోడ్ షోలు మరో వారం పాటు నిషేధం
- వచ్చే నెల నుంచి ఐదు రాష్ట్రాల ఎన్నికలు
- ఇటీవల షెడ్యూల్ విడుదల
- ఈ నెల 8 నుంచి 15 వరకు కరోనా నిషేధాజ్ఞలు
- మరో వారం పొడిగించిన ఈసీ
- ఈ నెల 22 వరకు సభలు, సమావేశాలపై ఆంక్షలు
అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో మరో వారం పాటు సభలు, రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై నిషేధం అమల్లో ఉంటుందని ఈసీ నేడు వెల్లడించింది. తాజా నిషేధాజ్ఞలు ఈ నెల 22 వరకు వర్తిస్తాయని తెలిపింది. ఇన్ డోర్ సభల్లో 300కి మించి పాల్గొనరాదని స్పష్టం చేసింది. సభలు, సమావేశాల్లో 50 శాతం సీటింగ్ కే అనుమతి ఉంటుందని పేర్కొంది.