తెలంగాణలో మరో 2,398 కరోనా కేసుల నమోదు

  • గత 24 గంటల్లో 68,525 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,233 కొత్త కేసులు
  • రాష్ట్రంలో మూడు మరణాలు
  • ఇంకా 21,676 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 68,525 శాంపిల్స్ పరీక్షించగా... 2,398 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,233, రంగారెడ్డి జిల్లాలో 192, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 191 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 1,181 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,052కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,05,199 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,79,471 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 21,676 మందికి చికిత్స కొనసాగుతోంది.

Telangana
Corona Virus
Daily Report

More Telugu News