సమరసింహారెడ్డి సినిమాలో నటించే చాన్స్ వదులుకున్న రాశి... అసలు కారణం ఇదేనట!
- 1999లో వచ్చిన సమరసింహారెడ్డి
- బాలకృష్ణ కెరీర్ లో బ్లాక్ బస్టర్
- రూ.16 కోట్ల మేర వసూళ్లు
- ఓ సీన్ పై రాశి అభ్యంతరం
- సిమ్రాన్ వైపు మొగ్గుచూసిన చిత్రబృందం
ఈ చిత్రంలో సిమ్రాన్, సంఘవి, అంజలా జవేరి నటించారు. కాగా, సిమ్రాన్ నటించిన పాత్రకు తొలుత రాశిని అనుకున్నారట. అయితే ఆ సినిమాలో ఓ సీన్ నచ్చకపోవడంతో రాశి అంత పెద్ద చిత్రాన్ని వదులుకుంది. అందులో హీరోయిన్ తో సీతాకోకచిలుక సీన్ ఉంటుంది. ఆ సీన్ పట్ల రాశి అభ్యంతరం వ్యక్తం చేయడంతో, సిమ్రాన్ వైపు మొగ్గారట.