ఏపీలో ఒక్కరోజులో 4,348 కరోనా కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!

AP Latest Corona Details Bulletin
  • రాష్ట్రంలో కరోనా ఉద్ధృతం
  • గత 24 గంటల్లో 47,884 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 932 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • 14 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
ఏపీలో కరోనా వ్యాప్తి అంతకంతకు అధికమవుతోంది. గడచిన 24 గంటల్లో 47,884 శాంపిల్స్ పరీక్షించగా... 4,348 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 932 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 823 కేసులు గుర్తించారు. ఒక్క పశ్చిమ గోదావరి (86) జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో 100కి పైనే పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 261 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,92,227 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,63,516 మంది ఆరోగ్యవంతులయ్యారు. అటు, యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం 14,204 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,507కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Bulletin
Today Cases

More Telugu News