రెండు కేసుల్లో దోషిగా తేలిన ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి శంకర్‌రావు.. తీర్పు విని స్పృహ తప్పి పడిపోయిన వైనం
- శంకర్‌రావుకు వ్యతిరేకంగా 2015లో మూడు కేసులు
- రెండింటిలో దోషిగా తేల్చిన కోర్టు
- సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఓ కేసులో ఊరట
వీటిపై నిన్న విచారణ జరగ్గా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఓ కేసులో ఆయనకు ఊరట లభించింది. అయితే, భూ వివాదంలో బెదిరింపులు, మహిళను దూషించిన కేసులో మాత్రం శంకర్‌రావును కోర్టు దోషిగా తేల్చింది. మహిళను దూషించిన కేసులో రూ. 2,000, మరో కేసులో రూ. 1,500 జరిమానా విధించింది. కోర్టులోనే ఉన్న మాజీ మంత్రి తీర్పు వెలువడిన వెంటనే షాక్‌తో స్పృహ తప్పి పడిపోయారు.