తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా నిర్ధారణ
- స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు
- కరోనా నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్లో మంత్రి
- తనను కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి
జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా సోకుతోందని, ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఇంట్లోంచి బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. కాగా, ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు నేతలకు కరోనా సోకిన విషయం తెలిసిందే.