ఈ ఏడాది టెన్త్ పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తాం: మంత్రి ఆదిమూలపు సురేశ్

  • గతేడాది కరోనా ప్రభావంతో టెన్త్ పరీక్షలు రద్దు
  • వినుకొండలో మీడియాతో మాట్లాడిన ఆదిమూలపు
  • మార్చిలో పదో తరగతి పరీక్షలు
  • 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని వెల్లడి
కరోనా సంక్షోభం కారణంగా గతేడాది టెన్త్ పరీక్షలు నిర్వహించలేకపోయిన ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ పరీక్షలు జరపాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వినుకొండలో మాట్లాడుతూ, మార్చిలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. సంక్రాంతి కల్లా సిలబస్ పూర్తిచేయాలని విద్యాసంస్థలకు నిర్దేశించారు. ఈసారి 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని వివరించారు.

ఇక 'అమ్మఒడి' మూడో విడత గురించి చెబుతూ, విద్యాసంవత్సరం ఆరంభంలో ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సంక్షేమ పథకాల అమలుకు వెనుకంజ వేయడంలేదని స్పష్టం చేశారు.


More Telugu News

Tenth Class Exams Adimulapu Suresh Andhra Pradesh Corona Virus