శంషాబాద్ విమానాశ్ర‌యంలో జేపీ న‌డ్డాను పోలీసులు అడ్డుకునే అవ‌కాశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్ విమానాశ్ర‌యంలో జేపీ న‌డ్డాను పోలీసులు అడ్డుకునే అవ‌కాశం

jp to reach hyderabad
  • సికింద్రాబాద్‌లో కొవ్వొత్తుల‌ ర్యాలీకి అనుమ‌తి నిరాక‌ర‌ణ‌
  • నిర్వ‌హించి తీరుతామ‌న్న బీజేపీ నేత‌లు
  • కాసేప‌ట్లో హైద‌రాబాద్‌కు జేపీ న‌డ్డా
బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను అరెస్టు చేసి ఆయ‌న‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి నిర‌స‌న‌గా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆధ్వ‌ర్యంలో సికింద్రాబాద్‌లో నిర్వ‌హించాల‌నుకున్న కొవ్వొత్తుల‌ ర్యాలీకి పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. కరోనా నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో ఆ ర్యాలీకి అనుమ‌తులు ఇవ్వ‌లేమ‌ని పోలీసులు చెప్పారు.

అయితే, ఈ ర్యాలీ నిర్వ‌హించి తీరుతామ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. మ‌రోవైపు, శంషాబాద్ విమానాశ్ర‌యం వ‌ద్ద పోలీసులు మోహ‌రించారు. జేపీ న‌డ్డాను విమానాశ్ర‌యంలోనే పోలీసులు అడ్డుకునే అవ‌కాశం ఉంది. కాగా, బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆ పార్టీ నేత‌లు మౌన దీక్ష చేప‌ట్టారు. త‌మ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అరెస్టుకు నిర‌స‌న‌గా న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించారు. ఈ దీక్ష‌లో రాజా సింగ్, ల‌క్ష్మ‌ణ్, విజ‌యశాంతి, ప్రేమేంద‌ర్ రెడ్డి పాల్గొన్నారు.
JP Nadda
BJP
Hyderabad

More Telugu News