తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
- ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు
- వైద్య, ఆరోగ్యశాఖతో సమీక్ష సందర్భంగా కేసీఆర్ ఆదేశాలు
- కరోనా పరిస్థితిని బట్టి 16వ తేదీన సెలవుల పొడిగింపుపై తదుపరి నిర్ణయం
మరోవైపు ఒమిక్రాన్ నేపథ్యంలో సభలు, ర్యాలీలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష సందర్భంగా కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.