CM Jagan: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ

CM Jagan meeting with PM Modi concludes
షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం జగన్ ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను ప్రధాని ఎదుట ప్రస్తావించారు. విభజన హామీలు నెరవేర్చాలని కోరారు. కాసేపట్లో సీఎం జగన్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు.
Go Back to Shorts
CM Jagan
Meeting
PM
Narendra Modi
YSRCP
Andhra Pradesh

More Telugu News