హీరో సాయి తేజ్ నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- ఇటీవల సాయి తేజ్ కు రోడ్డు ప్రమాదం
- కోలుకున్న సాయి తేజ్
- పరామర్శించిన కిషన్ రెడ్డి
- కృతజ్ఞతలు తెలిపిన సాయి తేజ్
కాగా, తన నివాసానికి కిషన్ రెడ్డి రాకపై సాయి తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. "ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మా ఇంటికి వచ్చి ఆప్యాయంగా పరామర్శించారు. ఎంతో సహృదయతతో మాట్లాడారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కిషన్ రెడ్డి గారూ, మీకు ఈ ఏడాది అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను" అంటూ సాయితేజ్ ట్వీట్ చేశారు.