నాకు క‌రోనా నిర్ధార‌ణ అయింది: సినీ హీరో మంచు మ‌నోజ్

Manchu Manoj Testes positive for Covid
  • ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన వారు ప‌రీక్ష‌లు చేయించుకోండి
  • దీనిపై అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
  • నా గురించి బాధ‌పడ‌కండి.. బాగానే ఉన్నాను
సినీ హీరో మంచు మ‌నోజ్‌కు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలుపుతూ ప‌లు సూచ‌న‌లు చేశాడు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని తెలిపాడు.

'నాకు క‌రోనా నిర్ధార‌ణ అయింది. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన వారు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నాను. దీనిపై అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. నా గురించి బాధ‌పడ‌కండి.. నేను ప్ర‌స్తుతం బాగానే ఉన్నాను.. మీ ప్రేమ, ఆశీర్వాదాలే అందుకు కార‌ణం. వైద్యులు, న‌ర్సులంద‌రికీ నేను కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను' అని మంచు మ‌నోజ్ పేర్కొన్నాడు.
Go Back to Shorts
Manchu Manoj
Tollywood
Corona Virus
COVID19

More Telugu News