గంగూలీ ఆరోగ్యం, చికిత్సపై డాక్టర్ల స్పందన!
- వుడ్ ల్యాండ్స్ హాస్పిటల్ లో చికిత్స
- మోనోక్లోనల్ యాంటీ బాడీ చికిత్స చేస్తున్నట్టు వెల్లడి
- గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటన
నిన్న గంగూలీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయనను వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆయనకు డాక్టర్ దేవిశెట్టి, డాక్టర్ అఫ్తాబ్ ఖాన్ ల సలహాలు తీసుకుంటూ డాక్టర్ సప్తర్షి బసూ, డాక్టర్ సౌతిక్ పాండాల వైద్యుల బృందం చికిత్స చేస్తోందని రూపాలీ బసూ చెప్పారు. మందులను సమయానికి డోసులువారీగా ఇస్తున్నట్టు తెలిపారు.