Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జ‌గ‌న్ స‌ర్.. అంద‌రికీ వ‌రాలు ఇస్తారు.. మాకు ఇవ్వ‌రా?: సినీ న‌టుడు బ్ర‌హ్మాజీ

andhariki varalu isthunnaru brahmaji tweet
  • సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ఏపీలో ర‌చ్చ‌
  • పాపం థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు సాయం చేయండ‌న్న బ్ర‌హ్మాజీ
  • సినిమా వాళ్ల‌కి కూడా సాయం చేయండని ట్వీట్
  • 'ఇట్లు మీ నాన్న గారి అభిమాని' అంటూ వ్యాఖ్య‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల తగ్గుద‌ల‌పై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ త‌న‌దైన శైలిలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన రెండు ఫొటోల‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా రీట్వీట్ చేశారు. తెలంగాణ‌లో కారు పార్కింగ్ ధ‌రే రూ.30 ఉంద‌ని, ఏపీలో మాత్రం బాల్క‌నీ టికెట్ ధ‌ర రూ.20, ఫ‌స్ట్ క్లాస్ రూ.15, సెకండ్ క్లాస్ టికెట్ ధ‌ర రూ.10 ఉందంటూ అందులో ఉంది. ఈ ఫొటోల‌నే బ్ర‌హ్మాజీ పోస్ట్ చేశారు.

'సీఎం జ‌గ‌న్ స‌ర్.. అంద‌రికీ వ‌రాలు ఇస్తారు.. పాపం థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు, సినిమా వాళ్ల‌కి కూడా సాయం చేయండి. ఇట్లు మీ మీ నాన్న గారి అభిమాని' అంటూ బ్రహ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, బ్రహ్మాజీ చేసిన ట్వీట్‌పై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తూ రిప్లైలు ఇస్తున్నారు.

bhahmaji
Tollywood
Jagan
Andhra Pradesh

More Telugu News