ఇక త్రివిక్రమ్ బ్యానర్ నుంచి వరుస సినిమాలు!
- దర్శకుడిగా వరుస హిట్లు
- సొంత బ్యానర్ ఏర్పాటు
- నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీమతి
- 'సార్' నిర్మాణంలో భాగస్వామ్యం
ఇందులో త్రివిక్రమ్ కూడా ఒక భాగస్వామినే అంటూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ ఒక మాదిరి బడ్జెట్ తో సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' పేరుతో ఒక సొంత బ్యానర్ ను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ పై ఇటీవలే ఒక సినిమాను కూడా ప్రకటించారు. నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాతో, కల్యాణ్ శంకర్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఇక తాజాగా ఈ రోజున ధనుశ్ - వెంకీ అట్లూరి సినిమా నుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కూడా త్రివిక్రమ్ బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. నిర్మాతలుగా నాగవంశీ పేరుతో పాటు, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య పేరు పడింది. ఈ సినిమాకి 'సార్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.