'ఆచార్య' నుంచి న్యూ ఇయర్ స్పెషల్!
- 'ఆచార్య'గా చిరంజీవి
- సిద్ధ పాత్రలో చరణ్
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్
ఇటు చిరంజీవి నుంచి వదిలిన 'లాహే లాహే' సాంగ్, అటు చరణ్ - పూజ హెగ్డే కాంబినేషన్లో వదిలిన 'నీలాంబరి' సాంగ్ ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయాయి. మణిశర్మ ట్యూన్స్ కి నూటికి నూరు మార్కులు పడిపోయాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో న్యూఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక బిగ్ అప్ డేట్ ను వదలనున్నట్టు చెప్పుకుంటున్నారు. చిరంజీవి - చరణ్ లకి సంబంధించిన కీలకమైన అంశాలతో కూడిన ఒక ట్రైలర్ ను గానీ .. ఇద్దరిపై చిత్రీకరించిన పాటను గాని వదిలే అవకాశం ఉందని అంటున్నారు. మేకర్స్ ఎలా ప్లాన్ చేశారో చూడాలి మరి.
.