జీ5లో విశేష ప్రేక్షాదరణ పొందుతున్న 'రిపబ్లిక్'‌, 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'... హైదరాబాదులో సక్సెస్‌ మీట్‌

22-12-2021 Wed 21:54 | Entertainment
  • నిహారిక నిర్మాణంలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ
  • వెబ్ సిరీస్ కు మంచి గుర్తింపు
  • సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ 
  • ఇటీవల జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం
జీ5 ఓటీటీ యాప్ లో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్, రిపబ్లిక్ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. రిపబ్లిక్ చిత్రం సాయి తేజ్‌ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కింది. ఒక చిన్న ఫ్యామిలీ లవ్ స్టోరీలో సంగీత్‌ శోభన్‌, సిమ్రన్‌ జంటగా నటించగా... సీనియర్‌ నరేశ్‌, తులసి, ‘గెటప్‌’ శీను, ప్రమీల రాణి (భామ) ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ను పింక్‌ ఎలిఫెంట్స్‌ పిక్చర్స్‌ పతాకంపై మెగా డాటర్‌ నిహారికా కొణిదెల నిర్మించడం విశేషం. మహేశ్ ఉప్పాల దర్శకత్వం వహించారు.

కాగా, రిపబ్లిక్, ఒక చిన్న ఫ్యామిలీ లవ్ స్టోరీ ఈ రెండూ జీ`5 ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, దూసుకుపోతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మెగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ మీట్‌ పేరుతో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ... "నాకు మంచి కంటెంట్‌ ప్రొడ్యూస్‌ చేయడం చాలా ఇష్టం. అందులో భాగంగా భారీ కమర్షియల్‌ సినిమాలు కూడా ప్రొడ్యూస్‌ చేసే అవకాశం ఫ్యూచర్‌లో ఉండొచ్చు. ఆడియెన్‌గా ఎలాంటి సినిమాలు చూడాలని అనుకుంటానో.. అలాంటి సినిమాలే నిర్మించాలని చూస్తా. జీ వాళ్ల దృష్టిలో కంటెంట్‌ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అది నేను దగ్గరగా చూశాను. నేను చేసిన ముద్దపప్పు ఆవకాయ, నాన్నకుచ్చి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మూడూ జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అవుతుండడం చాలా హ్యాపీగా ఉంది.

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సింగిల్‌ థ్రెడ్‌ స్టోరీ. ఈ క్రెడిట్‌ మా డైరెక్టర్‌ మహేశ్ గారు, రైటర్‌ మానస గారిదే. నాకు కథ చెప్పేటప్పుడే మహేశ్ గారు నన్ను ఆ కథతో కనెక్ట్‌ చేసి నడిపించారు. ప్రతి సీన్‌ విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది.

రిపబ్లిక్‌ సినిమా చాలా ఆనెస్ట్‌ మూవీ. దేవా కట్టా గొప్ప డైరెక్టర్. క్లైమాక్స్‌ నాకు అద్భుతంగా అనిపించింది" అని వివరించారు.

దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ... "నాకు కూడా ఫ్యామిలీ స్టోరీస్‌ చేయాలని ఉంది. నా దగ్గర రెండు, మూడు కథలు ఉన్నాయి. వెన్నెల కూడా నేను అనుకున్న స్థాయిలో చేయలేదనిపిస్తుంది. వెన్నెల తర్వాత ప్రస్థానం కథ చెబితే కొందరు హీరోలు వెన్నెలకు కొద్దిగా యాక్షన్‌ కలిపి తీసుకురా అన్నారు. ప్రస్థానం తర్వాత అది తప్ప మరోటి ఊహించుకోలేకపోతున్నారు. ఒక్కొక్క దర్శకుడికి ఒక్కో బలం ఉంటుంది. దాన్ని ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి హీరోలు ఇంట్రస్ట్‌ చూపిస్తూ ఉంటారు.

ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో ఇంత పెద్ద రెస్పాన్స్‌ వస్తుందని మేం ముందే ఊహించాం. సినిమా మీద మాకు ముందు నుంచి చాలా నమ్మకం ఉంది. గతంలో ఓ ప్రతిఘటన, ఓ రేపటిపౌరులు వంటి కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాం. కానీ గత 15, 20 సంవత్సరాలుగా ఆ సెక్షన్‌ ఆఫ్‌ ఆడియెన్స్‌ను కోల్పోయాం. అది మనం చేసిన తప్పే. ప్రేక్షకులకు మనం సోషల్‌ రెస్పాన్సిబులిటీ ఉన్న కంటెంట్‌ను ఇస్తే తప్పకుండా ఆనందిస్తారు, ఆదరిస్తారు. మా ‘రిపబ్లిక్‌’ ఓటీటీలో గ్రాండ్‌ సక్సెస్‌ కావటానికి ప్రధాన కారణం.. జీ5 వారు ప్రమోట్‌ చేసిన విధానమే అని కన్‌ఫర్మ్‌గా చెప్పగలను.

రిపబ్లిక్‌ లోని ప్రతి మాట.. ప్రతి సన్నివేశం ప్రతి ఆడియెన్స్‌ చర్చించే విషయమే. ఈ కథ సమాజంలోని ఒక తీవ్ర సంఘర్షణ నుంచి పుట్టింది కాబట్టే అంతగా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యింది. నెక్ట్స్‌ ఏ ఎమోషన్‌తో సినిమా చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు" అని వెల్లడించారు.
ZEE5OCFSRepublicOTTSuccess MeetHyderabad

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more