ఖరీదైన విడాకులు.. భరణంగా దుబాయ్ రాజు రూ.5,525 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు!
- మహ్మద్ బిన్ రషీద్ తో విడాకులు కోరిన 6వ భార్య హయా
- కీలక తీర్పును వెలువరించిన బ్రిటన్ హైకోర్టు
- పిల్లల బాధ్యతలకు ఏటా రూ. 112 కోట్లు ఇవ్వాలని తీర్పు
అంతేకాదు రషీద్, హయా సంతానం అల్ జలిలియా (14), జయాద్ (9) లకు చదువు కోసం రూ. 96 కోట్లు, వారి బాధ్యతల కోసం ప్రతి ఏటా రూ. 112 కోట్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇతర అవసరాల కోసం రూ. 2,907 కోట్లను బ్యాంకు గ్యారెంటీగా ఇవ్వాలని ఆదేశించింది. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల్లో ఇదొకటని విశ్లేషకులు అంటున్నారు.
హయా 2019లో దుబాయ్ నుంచి లండన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత విడాకుల కోసం అక్కడి హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు తన పిల్లలను అప్పగించాలని కోర్టును కోరారు. అప్పటి నుంచి విచారణ జరుపుతున్న కోర్టు ఇప్పుడు సంచలన తీర్పును వెలువరించింది.