నేడు కర్నూలుకు వెళుతున్న సీఎం జగన్
- కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరుకాన్నున్న జగన్
- అక్కడే పార్టీ నేతలతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం
- జగన్ పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు భద్రత
ఉదయం 10.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 11.15 గంటలకు ఆయన కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి 11.35 గంటలకు పంచలింగాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
అక్కడే 11.55 గంటల వరకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం 12.15 గంటలకు ఆయన తిరిగి విజయవాడకు బయల్దేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.