తెలంగాణలో మరో 134 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 25,900 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,693 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,564 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,71,856 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,693 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 4,015కి పెరిగింది.
