సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన అఖిలేశ్ యాదవ్
- సమాజ్ వాదీ పార్టీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు
- తీవ్రస్థాయిలో స్పందించిన అఖిలేశ్
- తమ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆగ్రహం
- వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపాటు
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, వివిధ ప్రభుత్వ యంత్రాంగాలను దుర్వినియోగం చేస్తున్నారని అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదన్న ఉద్దేశంతో వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. నిన్న సమాజ్ వాదీ పార్టీ నేతల ఇళ్లలో ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.