బెజవాడ ఇంద్రకీలాద్రిపై తిరిగే రెండు పాముల్లో ఒకటి మృతి... శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించిన అధికారులు

One snake dies at Indrakeeladri Durga Temple
  • ఇంద్రకీలాద్రిపై పాముల జంట సంచారం
  • ఎన్నో ఏళ్లుగా భక్తులతో పూజలందుకున్న పాములు
  • చనిపోయిన స్థితిలో పామును గుర్తించిన భక్తులు, అర్చకులు
  • దుర్గా ఘాట్ లో అంత్యక్రియలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల మనోభావాలకు సంబంధించి ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం పరిసరాల్లో రెండు పాములు సంచరిస్తున్నాయి. దుర్గామాత ఆలయంలో కనిపించే ఆ పాముల జంటను భక్తులు ఎంతో పవిత్రంగా భావించేవారు. ఆ రెండు పాములకు పూజలు చేసేవారు. ఆలయ అర్చకులు సైతం ఆ పాముల పట్ల భక్తిప్రపత్తులు కనబరిచేవారు.

అయితే అందరినీ తీవ్ర విచారానికి గురిచేస్తూ ఆ రెండు పాముల్లో ఒక పాము మరణించింది. కొండపై చనిపోయిన స్థితిలో ఉన్న పామును భక్తులు, అర్చకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ పాముకు శాస్త్రబద్ధంగా దుర్గా ఘాట్ లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రాంతంలో చనిపోయింది కాబట్టి దానికి మనుషులకు జరిపించినట్టే అంత్యక్రియలు జరిపించినట్టు అమ్మవారి ఆలయం వైదిక కమిటీ పేర్కొంది.
Go Back to Shorts
Snake
Death
Durga Temple
Indrakeeladri
Vijayawada

More Telugu News