విశాఖలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి పెళ్లి రిసెప్షన్ కు సీఎం జగన్ హాజరు

  • విశాఖ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్
  • ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన మంత్రి అవంతి, మేయర్
  • ఎన్ఏడీ ఫ్లైఓవర్ ప్రారంభం
  • వెంకయ్యనాయుడు మనవరాలి రిసెప్షన్ కు వెళ్లనున్న సీఎం
ఈ సాయంత్రం గన్నవరం నుంచి పయనమైన సీఎం జగన్ కొద్దిసేపటి కిందట విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు మంత్రి అవంతి శ్రీనివాస్, జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి, అధికారులు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. విశాఖ పర్యటనలో భాగంగా సీఎం జగన్ నగరంలో నూతనంగా నిర్మితమైన ఎన్ఏడీ ఫ్లైఓవర్ ప్రారంభించారు. వీఎంఆర్డీయే అభివృద్ధి చేసిన 6 ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ వెంట డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం జగన్ తన పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక, రవితేజల పెళ్లి రిసెప్షన్ కు హాజరయ్యారు. ఏపీ మంత్రులు కూడా ఈ వివాహ విందుకు హాజరయ్యారు. అంతకుముందు సీఎం జగన్ విశాఖ బీచ్ రోడ్డులో విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్య, సుభాష్ ల పెళ్లికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.

CM Jagan
NAD Flyover
Visakhapatnam
VMRDA
Projects

More Telugu News