ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై స్పష్టతనిచ్చిన ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి
- సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ ఏపీ సర్కారు జీవో
- జీవో నెం.35పై కోర్టుకు వెళ్లిన థియేటర్ల యాజమాన్యాలు
- థియేటర్లకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు
- జీవో నెం.35 అమల్లోనే ఉందన్న హోంశాఖ
టికెట్ల రేట్ల జీవో నెం.35పై హైకోర్టులో వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు కాగా, 3 పిటిషన్లకు కలిపి ఒకేసారి విచారణ, తీర్పు ఇచ్చినట్టు పేర్కొన్నారు. దాని ప్రకారం... తెనాలిలో 4 థియేటర్లు, చోడవరంలో 1 థియేటర్ కు పాత పద్ధతిలోనే టికెట్ల విక్రయాలకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని 225 థియేటర్లకు కూడా హైకోర్టు తీర్పు వర్తిస్తుందని వెల్లడించారు. ఈ థియేటర్లకు మాత్రమే హైకోర్టు జీవో నెం.35ని సస్పెండ్ చేసిందని హోంశాఖ ముఖ్యకార్యదర్శి వివరణ ఇచ్చారు.