ఏపీలో గత 24 గంటల్లో 132 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Bulletin
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 29,228 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 132 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 36 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 19 కేసులు గుర్తించారు. గుంటూరు జిల్లాలో 14, తూర్పు గోదావరి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 1 కేసు నమోదైంది. అదే సమయంలో 186 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,108 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,58,817 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,823 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,468కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Today Cases
Bulletin

More Telugu News