గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారికి అవకాశం... గవర్నర్ ఆమోదం
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్
- గవర్నర్ కోటాలో మధుసూదనాచారికి చాన్స్ ఇచ్చిన కేసీఆర్
- గతంలో అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన మధుసూదనాచారి
మధుసూదనాచారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించారు. అయితే 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. గతంలో సభను నడిపించిన అనుభవం ఉన్న మధుసూదనాచారిని శాసనమండలి చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.