అమరావతి రైతులకు గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతి
- రేపు శ్రీవారి దర్శనానికి అనుమతించిన టీటీడీ
- మొత్తం 500 మంది రైతులు శ్రీవారిని దర్శించుకోవచ్చన్న టీటీడీ
- ఈరోజు సాయంత్రం అలిపిరి వద్ద ముగియనున్న మహా పాదయాత్ర
ఈ రోజు వీరి యాత్ర 44వ రోజుకు చేరుకుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 400 కిలోమీటర్లకు పైగా వీరి యాత్ర కొనసాగింది. ప్రస్తుతం తిరుపతిలో వీరి యాత్ర కొనసాగుతోంది. ఈ సాయంత్రం అలిపిరి వద్ద వీరి పాదయాత్ర ముగియనుంది. రేపు వీరంతా శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ఈ నెల 17న తిరుపతిలో అమరావతి రైతులు బహిరంగసభను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సభకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ వీరు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు.