ఏపీలో మరో 108 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 21,010 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 36 కొత్త కేసులు
- కృష్ణా జిల్లాలో ఒకరి మృతి
- యాక్టివ్ కేసుల సంఖ్య 1,878
రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,976 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,58,631 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,878 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,467కి పెరిగింది.