ఏపీ ప్రభుత్వానికి మరో సలహాదారు... ఉత్తర్వులు జారీ

New advisor for AP Govt
  • మైనారిటీల సంక్షేమ శాఖ సలహాదారుగా జియావుద్దీన్
  • రెండేళ్ల పాటు కొనసాగనున్న జియావుద్దీన్
  • ఏపీ ప్రభుత్వానికి భారీ సంఖ్యలో సలహాదారులు
  • వారిలో కొందరికి క్యాబినెట్ హోదా
ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో సలహాదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వానికి మరో సలహాదారును నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ సలహాదారుగా షేక్ మహ్మద్ జియావుద్దీన్ ను నియమించారు. జియావుద్దీన్ ప్రభుత్వ సలహాదారుగా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఏపీ ప్రభుత్వానికి 30 మందికి పైగా సలహాదారులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో కొందరికి క్యాబినెట్ హోదా ఉంది. అంతేకాదు, నెలకు లక్షల్లో వేతనం, అదనపు సదుపాయాలు పొందుతారు.
Go Back to Shorts
Advisor
Ziauddin
AP Govt
CM Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News