తెలంగాణలో మరో 146 కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 26,625 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 72 కొత్త కేసులు
  • రంగారెడ్డి జిల్లాలో 20 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,846 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,625 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 146 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 72 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 189 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,78,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,70,435 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,846 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,007కి పెరిగింది.

Telangana
Statistics
Corona Virus
Update

More Telugu News