మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు... అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం లేఖ
- 27 జిల్లాల్లో పెరుగుతున్న కొత్త కేసులు
- 19 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం పాజిటివిటీ రేటు
- 8 జిల్లాల్లో 10 శాతం మించి పాజిటివిటీ రేటు
- నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్న కేంద్రం
కేరళ, మిజోరం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, మణిపూర్, నాగాలాండ్ లోని 19 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్య పాజిటివిటీ రేటు ఉందని వెల్లడించింది. మూడు రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో 10 శాతం కంటే అధికంగా పాజిటివిటీ రేటు నమోదవుతోందని వివరించింది. మొత్తమ్మీద 27 జిల్లాల్లో కేసుల సరళిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఒమిక్రాన్ కేసులు దేశంలో హెచ్చుతుండడంతో కొత్త వేరియంట్ మరో విపత్తు కాగలదన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలాగే డెల్టా వేరియంట్ దేశంలో అత్యధిక ప్రాణనష్టానికి దారితీసింది.